EDUCATION
Website - About Teachers and Education
Latest Updates...!
Sunday, 9 February 2014
Friday, 7 February 2014
Sunday, 26 January 2014
సర్వేపల్లి రాధాకృష్ణన్
డా.
సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan)
(సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు
మొట్టమొదటి ఉపరాష్ట్రపతి
మరియు రెండవ రాష్ట్రపతి
కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని
ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం
పదవిని చేపట్టి, భారతదేశపు
అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో
యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
అప్పటి
దక్షిణభారతదేశంలో మద్రాసుకు
ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతని మాతృభాష తెలుగు.
సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే
గడిచిపోయాయి. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి కళలలో పట్టభద్రుడు అయ్యారు. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో
శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత
రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి
అతనివద్దకు వచ్చినప్పుడు, "నా
పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని
ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల
తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా
జరుపుకుంటున్నారు.[2]
ఈయన
పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత
ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని
అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ
తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ
ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో
వివేకము, తర్కము
ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ
తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. [3]
- మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ
పదవులను అలంకరించారు.
- 1918 నుండి 1921 వరకు మైసూరు
విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
- 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్
ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
- 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన
విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం
వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే
అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా
విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
- 1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు
ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు
విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు "తులనాత్మక మతము"(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
- 1931 నుండి 1936 వరకు ఆంధ్ర
విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్
ఛాన్సలర్) పనిచేసారు.
- 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్
రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో
1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
- 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ
విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
- 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత
రాయబారిగా పనిచేసారు.
- 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం
తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
- 1948లో విశ్వవిద్యాలయాల విద్యా
కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
- 1948లో యునెస్కో కార్యనిర్వాహక
బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
- 1952లో యునెస్కో అధ్యక్షునిగా
ఎంపికయ్యారు.
- 1962లో బ్రిటీషు ఎకాడమీకి
గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
గౌరవములు
- ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ
సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ
దినోత్సవంగా జరుపుకుంటారు.
- 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు
ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
- 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన
కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
- 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క
శాంతి బహుమానం (Peace Prize of the German Book
Trade) పొందారు.
- 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా
ఎన్నుకోబడ్డారు.
- ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు
పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
- ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్
చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.
రచనలు
- The
Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక
తలంపు)(1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
- The
Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని
తత్వము)(1918).
- The
Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).
- Indian
Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
- The
Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము)(1926).
- The
Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
- Kalki
or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క
భవిష్యత్తు)(1929).
- An
Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత
ధృక్కోణము)(1932).
- East
and West in Religion (ప్రాక్ పశ్చిమాలలో మతము)(1933).
- Freedom
and Culture (స్వాతంత్ర్యం మరియు
సంస్కృతి)(1936).
- The
Heart of Hindusthan (భారతీయ హృదయము)(1936).
- My
Search for Truth (Autobiography)(నా
సత్యశోధన(ఆత్మకధ))(1937).
- Gautama,
The Buddha (గౌతమ బుద్ధుడు)(1938).
- Eastern
Religions and Western Thought (తూర్పు మతాలు మరియు
పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
- Mahatma
Gandhi (మహాత్మా గాంధీ)(1939).
- India
and China (భారత దేశము మరియు చైనా)(1944).
- Education,
Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
- Is
this Peace (ఇది శాంతేనా)(1945).
- The
Religion and Society (మతము మరియు సంఘము)(1947).
- The
Bhagwadgita (భగవధ్గీత)(1948).
- Great
Indians (భారతీయ మహానీయులు)(1949).
- East
and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని
చింతనలు)(1955).
- Religion
in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).
Saturday, 25 January 2014
సర్ధార్ వల్లభ్ భాయి పటేల్
భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు.[1] ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు.హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశము లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
60 ఏళ్ళ స్వతంత్ర భారతం
60 ఏళ్ళ స్వతంత్ర
భారతం
********************
********************
ఏన్ని ఉద్యమాలూ చేశారూ,ఏన్ని పోరాటాలు చేశారు మనకు స్వాతంత్రయం తీసుకురావడానికి.భగత్
సింఘ్,సుభాష్ చంద్ర బోస్,మోహన్ దాస్ కరంచంద్ గాంధీ,పండిట్ జావహర్ లాల్ నేహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సితారామారా రాజూ వీరంతా మన స్వాతంత్రయ సమరయోధులు. ఒక్కపటి
ప్రజా ఉధ్యమాలల్లో వీరునెత్తురోడిచి మనకు స్వాతంత్రయం తేచ్చారు.కాని మనం ఈ రోజూ
వాళ్ళు తెచ్చిన ఫలాన్ని అందుకోలేకపొతున్నాం.ఆ రోజుల్లో మంచికి ప్రాధాన్యం ఎక్కువ, కానీ ఈ రొజుల్లో చేడుకూ మంచి పేరు..మనం తేచ్చుకున్న ఫలాన్ని మనమే
చేతులారా చేజరుచుకుంటున్నాం. భారత దేశంలో ఎన్నో కళలు,సాంప్రదాయాలు,మతాలు,జాతులు ఉన్న గొప్ప దేశం.ఎంతో గొప్ప సంపద ఉన్న దేశంగా పేరు పొందిందీ
మన భారతదేశం. కానీ ఆ సంపదని కొల్లగొట్టుకెళ్ళారు తెల్లవాళ్ళు.మనం తెలుసుకోవలసిన
విషయం ఏమిటంటే భారత దేశం గత 10,000 ఏళ్ళలో ఏ రాజ్యం
పైన దండయాత్ర చేయలేదు.17వ శతాబ్దంలో తెల్లదొరలు మన దేశానికి రాక ముందు అత్యంత వనరులున్న
దేశంగా పేరు పొందింది.కనీ అవి కొంత మంది స్వార్ధపరుల కారణంగా ఇతర
దేశాలకుతరలిపోతున్నాయి.మన దేశంలో మతం 'భారతీయం'.ప్రజలు నమ్మేది కూడా అదే.కానీ ఇది 21వ శతాబ్దం.అందునా మన దేశానికి స్వాతంత్రయం వచ్చి 60ఏళ్ళు పుర్తికావస్తుంది.కానీ మనకి స్వాతంత్రయం వచ్చినట్టు ఎక్కడా
కనిపించటంలేదు.దీనికి ప్రదనమైన కారణాలు మన ఎన్నికల విధానం, రాజకీయ విధానాలు, రజకీయ నాయకులు, అవినీతి,
లంచగొండితనం, పాలనా విధానాలు,ప్రజాస్వామ్యపు
విలువలు తెలియకపోవటం,
మోసం, స్వప్రయోజనాలు, స్వార్ధంచెప్పుకుంటూ
పొతే ఎన్నో వస్తాయి.ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యపు దేశాలల్లో భారత్ ఒక గొప్ప
దేశంగా గత 10,000
ఏళ్ళగా ఉందని చరిత్రలు
చెబుతున్నాయి.ఒకప్పటి నాయకులకు ప్రజాస్వామ్యం పై మంచి అవగాహన ఉండేది. కానీ ఇప్పటి
నాయకుల్లో అది కనుమరుగవుతుంది.దీనికి కారణం ఇప్పటి నాయకులకు ప్రజాస్వామ్యం అంటే
ఏంటో సరిగ్గా తెలియక పోవటం.డెమాక్రసీ అంటారు, దనికి సరిగా స్పెల్లింగు తెలియని వాళ్ళు ఇప్పటి నాయకులు.
స్వార్ధపూరిత రజకీయలకు అలవాటుపడి తమ రంగును మర్చుకోలేని పరీస్థితి వాళ్ళది. వాళ్ళ
స్వార్ధం కోసం డబ్బునూ,కులాలను ఉపయోగించుకోవటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల
సమయంలో ఓట్ల కోసం వారు ఇచ్చే హామీలు ఆకాశానంటుతాయి.హామీలు ఇస్తారు అంతే,కనీ వాటిని తీర్చే సమయం వారికి దొరకదు..అందుకునే పేదవాడు
పేదవాడిగానే మిగిలి పోతున్నాడు.దారిద్రయపు రేఖకు దిగువనుండిపోతున్నారు. వారిని
పట్టించుకొనే నాధుడే లేడు.60ఏళ్ళ మన స్వాతంత్రయపు కానుకగా మనకి మన రాజకీయ నాయకులు ఇచ్చారూ..వారికి
బలం మనమే ఇస్తున్నాం ఓట్లు వేసి.పనికి రాని హామీలతో ప్రజల ముందుకు వచ్చి అవి
తీర్చలేక మనని ముప్పేట ముంచుతున్నారు.ఇలా చేసి ప్రజస్వామ్యపు విలువలను
దిగజారుస్తున్నారు. ఏమైనాఅడిగితే దౌర్జన్యం చేస్తారు.మనం చేసే తప్పులు కూడా కొన్ని
ఉన్నయి. హామీలు తీర్చలేని నేతలకు మనం ఓటు వేయడం.మనం ఏప్పుడైతే వరిని
నిలదీయగలుగుతామో అప్పుడే మనం ప్రజాస్వామ్యానీ కాపాడిన ప్రజలమవుతాం..ప్రజల సమస్యలను
పట్టించుకోని నాయకులను మనం సమాజం నుంచి వెలివేయాలి.ఇప్పటికైనా కళ్ళు తేరిచి మనకు
జరిగే అన్యాయాన్ని ఎదురుకోవాలి.మన స్వాతంత్రయన్ని మళ్ళి మనం తెచ్చుకోవాలీ.ఈ రోజు
సమజం లో డబ్బు ఉన్న వళ్ళకి ఒక రకమైన మర్యాదా, డబ్బు లేని వారికి ఒక రకమైన అవమానం జరుగుతుంది. దీన్నీ మనం చూస్తూ
సహించేది కాదు. కలసి కట్టుగా పోరాడి మళ్ళీ ఈ రాబంద రాజకీయాలపై సమరభేరీ మోగించీ మన
స్వతంత భారతాన్ని నిర్మించుకుందాం. మన పెద్దలు కన్న కలలను సార్తకం చేసుకుందాం.నవ
భారతాన్ని నిర్మిద్దాం..నాటి వివేకానందుడి నుంచి నేటి కలాం వరకూ చెప్పిన పద్దతులను
పాటిద్దం.ఇప్పటి వరకూ 60
ఎళ్ళలో ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను
నెరవేర్చలేదూ.దీనికి మనం ఇచ్చిన చనువే కారణం.కానీ మనం ఇంక అలా చేసే ప్రయత్నం
చేయకూడదు. తిరగబడదాం,
విప్లవాలకు తెరలేపుదాం. ప్రజలకు మనం
కోల్పోయే స్వాతంత్రయాన్ని చూపించి తిరిగి వచ్చే సాధన చేద్దం. దీనికి ప్రతీ ఒక్కరి
సాధన అవసరం. 60
ఏళ్ళ స్వతంత్ర భారతాన్ని తిరిగి ఒక
గొప్ప వేదికగా మలిచి అక్రమాలకు, అన్యాయాలకు
అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసే విధానంలో ముందుకు సాగుదాం . జైహింద్ ...
లాల్ బహదుర్ శాస్త్రీ
పేరు
|
:
|
లాల్
బహదూర్ శాస్త్రి.
|
తండ్రి
పేరు
|
:
|
శారదాప్రసాద్
రాయ్ .
|
తల్లి
పేరు
|
:
|
(తెలియదు).
|
పుట్టిన
తేది
|
:
|
2-10-1904.
|
పుట్టిన
ప్రదేశం
|
:
|
ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
|
చదివిన
ప్రదేశం
|
:
|
మొగల్
సరాయ్
|
చదువు
|
:
|
(తెలియదు).
|
గొప్పదనం
|
:
|
బ్రిటీషు
వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం
ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
|
స్వర్గస్థుడైన
తేది
|
:
|
1966
వ సంవత్సరంలో
స్వర్గస్థుడైనారు.
|
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు
అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన
కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్
బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖాలలో
మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయాలని అప్పటికే కృషి చేస్తున్న
మహాత్మాగాంధీ గారి జన్మదినమైన అక్టోబరు 2వ తారీఖునే, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతులకు మరీ ఆనందం కలుగచేసింది. చరిత్ర ప్రాధాన్యంగల మహొన్నత
దినంలో జన్మించిన తమ కుమారుడు గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత బిడ్డలలో
ముఖ్యుడు కాగలడనీ, దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయగలడనీ ఆ పుణ్య
దంపతులు ఆ రోజే ఊహించారు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్ బహదూర్
తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ
కుటుంబాన్ని లాల్ బహదూర్ తాతగారు ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించారు.
తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విధ్యార్ధులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదుచేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది.
నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు.
అలా కష్టపడి చదువుకుంటూ, అతి నిరాడంబరముగా జీవితం గడుపుతూ పై చదువుల కొచ్చేసరికి, మహాత్మాగాంధీ పిలుపు నందుకొని చదువుకు స్వస్తి చెప్పి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమంలో చేరి అనేక సార్లు జైలు శిక్ష ననుభవించాడు. జైలు శిక్ష అనంతరం కాశీలోని వైద్యపీఠంలో అద్యయనం చేసి "శాస్త్రి" అనే పట్టా అందుకున్నాడు. అప్పటినుంచి లాల్ బహదూర్ శాస్త్రి అయ్యాడు. జైలులో ఉన్నప్పుడు, విద్యాపీఠంలో ఉన్నప్పుడు సుప్రసిద్ద గాంధేయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల సాంగత్యంతో అతనిలో దేశ స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలయినా అర్పించాలనే దృఢ నిర్ణయం ఆనాడే నాటుకుంది.
బ్రిటీషు దొరలు భారతీయుల్ని బానిసలుగా చేసి, పెత్తనం చెలాయించడానికి ముఖ్య కారణాలు, మనలో చదువుకున్న వారు చాలా తక్కువ. శుచి శుభ్రతల గురించి తెలియదు. పైగా తిండి, బట్టకు కూడా కరువైన దరిద్రనారాయణులు అసంఖ్యాకంగా ఉండటం. కాబట్టి వీటిని రూపుమాపిన నాడు ఆ దొరలను తరిమికొట్టవచ్చుననే తలంపుతో శాస్త్రి నగర శివారలోని మురికివాడలలో అత్యంత దీనాతిదీన స్థితిలో ఉన్న హరిజనులను కలసి, వారికి విద్యాబుద్దులు నేర్పించి, వారి కష్ట నష్టాలలో పాలుపంచుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.
కాంగ్రెస్ లో చేరి తన సత్‌ప్రవర్తనతో, కార్యదీక్షతో, నిరాడంబరతతో మేధావుల మెప్పును పొంది, లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, పండిట్ గోవిందవల్లభ్, పండిట్ వంటి మహాత్ముల ఆశీస్సులు పొంది, ఇటు ప్రజలలోనూ, అటు నాయకులలోనూ ఉత్తమ నాయకుడనే పేరు పొందిన శాస్త్రి ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా పాల్గొని అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించి, బ్రిటీషు వారి పక్కలో బల్లెంగా తయారయ్యి దేశ స్వాతంత్ర్యం సమరంలో అత్యంత కీలకమైన పాత్ర వహించాడు. శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 1956లో "అరియలూరు" లో రైలు ప్రమాదం జరిగినప్పుడు అది తన పదవి నిర్వహణా కాలంలో జరిగింది కనుక, తాను రాజీనామా చేయటం నైతిక భాద్యత అని ప్రకటించి మంత్రివర్గం నుంచి తప్పుకున్నాడు. ఆ విషయంలో నెహ్రూ నచ్చజెప్పినా సంతృప్తి పడక శాస్త్రి తన నిర్ణయం మార్చుకోలేదు.
అత్యంత నిరాడంబరుడు, మితభాషి, కార్యవాది, యుక్తాయుక్తా పరిజ్ఞానం గల శాస్త్రి, 1964లో నెహ్రూ అకాల మరణం వలన ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రధాన మంత్రిగా రష్యా పర్యటించినప్పుడు, శ్రీ శాస్త్రిని అతి నిరాడంబరంగా మామూలు కాలిజోళ్ళు, సామాన్య దుస్తులతో చూసి రష్యా ప్రజలు నివ్వెరపోయారు. సూటు, బూటు, హేటులతో ఆడంబరంతో ఆర్భాటంతో పర్యటిస్తాడని అనుకున్న వారికి శాస్త్రి వాలకం "ఆశ్చర్యం" కలిగించింది.
నిరుపేద కుటుంబంలో పుట్టి, ఉన్నత పదవులను అలంకరించినా నిరాడంబరంగా జీవించి 1966 స్వర్గస్థులైన శ్రీ శాస్త్రి జీవితం అందరికీ ఒక చక్కని సందేశం.

మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్ ;
Subscribe to:
Posts (Atom)
Popular Posts
- District Wise NMMS Results Selected Candidates List 2013
- Bihar 10th Class SSC Matriculation Compartmental Results 2013
- Warangal District Panchayat Secretary Job Recruitment Notification 2013
- 10th Class (SSC) Nominal Rolls Fee Particulars 2014
- District wise SSC Spot Valuation Lists 2013
- Rc.No.7105 Dated 07.11.2013 High Court Orders on G.O Ms.No.610
- Putta Srinivas Reddy Income Tax Software 2012-2013
- AP Model Schools TGT PGT Zone Wise Allotment List Merit List Cut Off Marks
- AP Grade 4 Contract Panchyat Secretary Results Merit List 2013