Latest Updates...!

Saturday, 25 January 2014

60 ఏళ్ళ స్వతంత్ర భారతం

60 ఏళ్ళ స్వతంత్ర భారతం
********************

ఏన్ని ఉద్యమాలూ చేశారూ,ఏన్ని పోరాటాలు చేశారు మనకు స్వాతంత్రయం తీసుకురావడానికి.భగత్ సింఘ్,సుభాష్ చంద్ర బోస్,మోహన్ దాస్ కరంచంద్ గాంధీ,పండిట్ జావహర్ లాల్ నేహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సితారామారా రాజూ వీరంతా మన స్వాతంత్రయ సమరయోధులు. ఒక్కపటి ప్రజా ఉధ్యమాలల్లో వీరునెత్తురోడిచి మనకు స్వాతంత్రయం తేచ్చారు.కాని మనం ఈ రోజూ వాళ్ళు తెచ్చిన ఫలాన్ని అందుకోలేకపొతున్నాం.ఆ రోజుల్లో మంచికి ప్రాధాన్యం ఎక్కువ, కానీ ఈ రొజుల్లో చేడుకూ మంచి పేరు..మనం తేచ్చుకున్న ఫలాన్ని మనమే చేతులారా చేజరుచుకుంటున్నాం. భారత దేశంలో ఎన్నో కళలు,సాంప్రదాయాలు,మతాలు,జాతులు ఉన్న గొప్ప దేశం.ఎంతో గొప్ప సంపద ఉన్న దేశంగా పేరు పొందిందీ మన భారతదేశం. కానీ ఆ సంపదని కొల్లగొట్టుకెళ్ళారు తెల్లవాళ్ళు.మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే భారత దేశం గత 10,000 ఏళ్ళలో ఏ రాజ్యం పైన దండయాత్ర చేయలేదు.17వ శతాబ్దంలో తెల్లదొరలు మన దేశానికి రాక ముందు అత్యంత వనరులున్న దేశంగా పేరు పొందింది.కనీ అవి కొంత మంది స్వార్ధపరుల కారణంగా ఇతర దేశాలకుతరలిపోతున్నాయి.మన దేశంలో మతం 'భారతీయం'.ప్రజలు నమ్మేది కూడా అదే.కానీ ఇది 21వ శతాబ్దం.అందునా మన దేశానికి స్వాతంత్రయం వచ్చి 60ఏళ్ళు పుర్తికావస్తుంది.కానీ మనకి స్వాతంత్రయం వచ్చినట్టు ఎక్కడా కనిపించటంలేదు.దీనికి ప్రదనమైన కారణాలు మన ఎన్నికల విధానం, రాజకీయ విధానాలు, రజకీయ నాయకులు, అవినీతి, లంచగొండితనం, పాలనా విధానాలు,ప్రజాస్వామ్యపు విలువలు తెలియకపోవటం, మోసం, స్వప్రయోజనాలు, స్వార్ధంచెప్పుకుంటూ పొతే ఎన్నో వస్తాయి.ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యపు దేశాలల్లో భారత్ ఒక గొప్ప దేశంగా గత 10,000 ఏళ్ళగా ఉందని చరిత్రలు చెబుతున్నాయి.ఒకప్పటి నాయకులకు ప్రజాస్వామ్యం పై మంచి అవగాహన ఉండేది. కానీ ఇప్పటి నాయకుల్లో అది కనుమరుగవుతుంది.దీనికి కారణం ఇప్పటి నాయకులకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో సరిగ్గా తెలియక పోవటం.డెమాక్రసీ అంటారు, దనికి సరిగా స్పెల్లింగు తెలియని వాళ్ళు ఇప్పటి నాయకులు. స్వార్ధపూరిత రజకీయలకు అలవాటుపడి తమ రంగును మర్చుకోలేని పరీస్థితి వాళ్ళది. వాళ్ళ స్వార్ధం కోసం డబ్బునూ,కులాలను ఉపయోగించుకోవటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వారు ఇచ్చే హామీలు ఆకాశానంటుతాయి.హామీలు ఇస్తారు అంతే,కనీ వాటిని తీర్చే సమయం వారికి దొరకదు..అందుకునే పేదవాడు పేదవాడిగానే మిగిలి పోతున్నాడు.దారిద్రయపు రేఖకు దిగువనుండిపోతున్నారు. వారిని పట్టించుకొనే నాధుడే లేడు.60ఏళ్ళ మన స్వాతంత్రయపు కానుకగా మనకి మన రాజకీయ నాయకులు ఇచ్చారూ..వారికి బలం మనమే ఇస్తున్నాం ఓట్లు వేసి.పనికి రాని హామీలతో ప్రజల ముందుకు వచ్చి అవి తీర్చలేక మనని ముప్పేట ముంచుతున్నారు.ఇలా చేసి ప్రజస్వామ్యపు విలువలను దిగజారుస్తున్నారు. ఏమైనాఅడిగితే దౌర్జన్యం చేస్తారు.మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉన్నయి. హామీలు తీర్చలేని నేతలకు మనం ఓటు వేయడం.మనం ఏప్పుడైతే వరిని నిలదీయగలుగుతామో అప్పుడే మనం ప్రజాస్వామ్యానీ కాపాడిన ప్రజలమవుతాం..ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులను మనం సమాజం నుంచి వెలివేయాలి.ఇప్పటికైనా కళ్ళు తేరిచి మనకు జరిగే అన్యాయాన్ని ఎదురుకోవాలి.మన స్వాతంత్రయన్ని మళ్ళి మనం తెచ్చుకోవాలీ.ఈ రోజు సమజం లో డబ్బు ఉన్న వళ్ళకి ఒక రకమైన మర్యాదా, డబ్బు లేని వారికి ఒక రకమైన అవమానం జరుగుతుంది. దీన్నీ మనం చూస్తూ సహించేది కాదు. కలసి కట్టుగా పోరాడి మళ్ళీ ఈ రాబంద రాజకీయాలపై సమరభేరీ మోగించీ మన స్వతంత భారతాన్ని నిర్మించుకుందాం. మన పెద్దలు కన్న కలలను సార్తకం చేసుకుందాం.నవ భారతాన్ని నిర్మిద్దాం..నాటి వివేకానందుడి నుంచి నేటి కలాం వరకూ చెప్పిన పద్దతులను పాటిద్దం.ఇప్పటి వరకూ 60 ఎళ్ళలో ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదూ.దీనికి మనం ఇచ్చిన చనువే కారణం.కానీ మనం ఇంక అలా చేసే ప్రయత్నం చేయకూడదు. తిరగబడదాం, విప్లవాలకు తెరలేపుదాం. ప్రజలకు మనం కోల్పోయే స్వాతంత్రయాన్ని చూపించి తిరిగి వచ్చే సాధన చేద్దం. దీనికి ప్రతీ ఒక్కరి సాధన అవసరం. 60 ఏళ్ళ స్వతంత్ర భారతాన్ని తిరిగి ఒక గొప్ప వేదికగా మలిచి అక్రమాలకు, అన్యాయాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసే విధానంలో ముందుకు సాగుదాం . జైహింద్ ...


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...