Latest Updates...!

Saturday, 16 November 2013

1st December - World Aids Day

ఎయిడ్స్ దినోత్సవం (ప్రపంచ ) , Aids Day (world)
 
ప్రతిఏటా డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం " గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా 3.8 కోట్ల మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు . . భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది .

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహమ్మరి పై తాజాగా రూపొందించిన నివేదికను మూన్ జెనీవాలో విడుదల చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో ఈ వ్యాధి 17 శాతం తగ్గుముఖం పట్టిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నలభై లక్షల మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వివరించింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని కోరింది. లైంగిక సంబంధాల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని

భారత్‌లో కూడా ఎయిడ్స్ రోగుల సంఖ్య 5.70 నుంచి 2.56 కోట్లకు తగ్గినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సంస్థ (నాకో) ప్రకటించింది. దీనికంతటికీ కారణం.. ప్రభుత్వాలు, ప్రైవేట్, స్వచ్ఛంధ సంస్థలు చేపడుతున్న విస్తృత ప్రచారం కారణంగా ఎయిడ్స్‌పై అవగాహన పెరుగుతోంది. అందువల్లే సంభోగ సమయంలో సురక్షిత పద్దతులను అవలంభిస్తున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఎయిడ్స్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. "స్టాప్ ఎయిడ్స్... కీప్ ది ప్రామిస్" అన్న నినాదంతో సమాజం నుంచి ఎయిడ్స్‌ని తరిమికొట్టాలని సూచించింది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే దీనికి తగిన నాయకత్వం కావాలని పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజనల్ డైరక్టర్ డాక్టర్ శామ్లీ ప్లియాన్‌బాంగ్‌చంగ్ మాట్లాడుతూ... ఎయిడ్స్ మహమ్మారికి ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత ఆసరానిస్తున్నాయనీ, ఫలితంగానే ఎయిడ్స్ మరింత విజృంభిస్తోందని అన్నారు.

ఎయిడ్స్‌ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్య వంతులు చేసి తద్వారా ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి. ప్రతిఏటా డిసెంబర్‌ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో గ్రామస్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు ఉన్న పౌరులందరు ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ఇందుకు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాద్యత వైద్య శాఖపైన ఉంది . ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉన్న ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అప్రమత్తతతో పాటు ముందుస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . గతంలో ఎయిడ్స్‌ వల్ల చాలా మరణాలు జరిగాయని ఎయిడ్స్‌ వ్యాధికి మందులేదు కాని నియంత్రించే మార్గాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.. విచ్చలవిడి శృంగారం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమిస్తుందని వీటిని అరికట్టాల్సిన బాద్యత ప్రతి ఒక్కరి పైన ఉంది . వ్యాధి బారిన పడ్డ వారిని గుర్తించడంతో పాటు వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంసుఖజీవనానికి సామాజికభద్రత కల్పించడం జరుగుతుందన్నారు. స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలను , ప్రభుత్వ పరంగా పలుసౌకర్యాలు కల్పించడం జరుగుతుంది, అలాగే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటు గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలి . పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిడ్సి పట్ల వారి తల్లిదండ్రులు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉంది

పూర్తి వివరాలకోసం : ఎయిద్స్ వ్యాది .
  • ====================================

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...