Latest Updates...!

Saturday, 16 November 2013

22nd December - National Mathematics Day

జాతీయ గణిశాస్త్ర దినోత్సవం(మేథమెటిక్స్‌ డే),National Mathematics Day


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 22) - మేథమెటిక్స్ డే - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

సర్వశాస్త్రాలకు తల్లివంటిది గణితం , అటువంటి గణితశాస్త్రానికి పుట్టిల్లు భారతదేశము . మిగిలిన ప్రపంచములో విజ్ఞానశాస్త్రము ఉదయించకముందే ఇక్కడ మహాపురుషులు ఖగోళశాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళారు . కాల గమనము , గ్రహణాల అంచనాలు , పంచాంగ నిర్మాణము  వంటివన్నీ వారి ప్రతిభకు నిదర్శనము . అంకెలు కనుగొన్నది , గణితం లో కీలకమైన సున్నాని కనుగొన్నది భారతీయులే.

అటువంటి  గణిత శాస్త్రములోనె కాక అనేక ఇతర శాస్త్రాలలో కూడా ముందున్న భారతదేశము పలుకారణాలు చేత (ముఖ్యము గా రాజకీయం వలన) తన విజ్ఞానశాస్త్ర ప్రగతిలో వెనకపడిపోయి ఐరోపాకి దాసోహమైపోయింది. ఐరోపా ఖండములో విజ్ఞానశాస్త్ర ప్రగతి వేగం పుంజుకుని , భారతీయులు వారిమీద ఆధారపడాల్సివచ్చింది. అయినప్పటికీ అడపాదడపా భారతదేశములో ఒక్కో మేధావి జన్మించి , తమ పూర్వీకుల విజ్ఞానానికి వారసుడుగా ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంటారు. అటువంటి గణితశాస్త్ర మేధావి " శ్రీనివాసరామానుజం "

శ్రీనివాస రామానుజన్‌ జయంతి ని (జననము తేది 22-12-1887--మరణము తేదీ 26-04-1920 ), గణిత శాస్త్రం పై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము మేథమెటిక్స్‌ డే (గణిశాస్త్ర దినోత్సవం) గా ప్రకటించింది.

1887వ సంవత్సరంలో తమి ళనాడులో కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అ య్యంగార్‌ దంపతులకు జన్మించారు శ్రీని వాస రామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిన రామా నుజన్‌ ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరిం చారు. ఈయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు. రామానుజన్‌ మేధస్సుకు ఆశ్చర్యపడిన హార్డీ ఆయనను బ్రిటన్‌కు ఆహ్వానించారు. అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'మెంబర్ గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేక చిక్కు సమస్యలను పరిష్కరించి, ఎన్నో కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరించారు. క్షయవ్యాధికి గురై 1919లో స్వదేశం చేరుకున్న ఆయన 26-04-1920న పిన్నవయస్సులోనే మరణించారు. 1962లో రామానుజన్‌ 75వ జన్మదినం సందర్భంగా... భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది.

పూర్తి జీవితవిశేషాల గురించి వికీపిడియాను చూడండి -> శ్రీనివాస రామానుజన్‌.

  • =========================================

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...