ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే , Armed forces Flag Day
ఏటా డిసెంబర్ 07 వ తేదీన " ఫ్లాగ్ డే " ని నిర్వహిస్తారు.
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసెంబర్ 07) - ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
భారితీయ సైనిక సిబ్బందికి సహాయ సహకారాలు అందించడము కోసము ఉద్దేశించిన దినము 'ఆర్మ్‌డ్ ఫొరెస్ ఫ్లాగ్ డే లేదా ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా' . భారతీయ సైనిక సిబ్బంది సంక్షేమము కోసము ఈ రోజున నిధులు వసూలు చే్స్తారు . ఏటా డిసెంబర్ 07 వ తేదీన " ఫ్లాగ్ డే " ని నిర్వహిస్తారు . 1949 నుండి జరుపుకుంటూ వస్తున్నారు . భారత దేశానికి స్వాతంత్రము వచ్చిన వెంటనే రక్షణ సిబ్బంది సంక్షేమ నిర్వహణ అవసరము పభుత్వానికి ఏర్పడింది . 1949 ఆగస్టు 28 వ తేదీన రక్షణమంత్రి నేతృత్వములో ఏర్పడిన కమిటీ ప్రతి సంవత్సరము డిసెంబర్ 07 న ఫ్లాగ్ డే ని పాటించాలని నిర్ణయించినది . ఈ ఫ్లాగ్ డే నాడు జెండాలను పంచి అందుకు గాను విరాలాలు సేకరిస్తారు .
దేశరక్షణకోసము పోరాడే సైనిక సిబ్బంది కుటుంబీకులు , వారిపై ఆధారపడి జీవించేవారి పరిరక్షణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజలు పాలు పంచుకోవాలనే ఉద్దేశము తో విరాలాలు వసూలు చేసున్న దృస్ట్యా ఫ్లాగ్ డే కు అత్యధిక ప్రాధాన్యత లభించినది . ఫ్లాగ్ డే ప్రధానము గా మూడు ప్రయోజనాల్ని దృస్టిలో ఉంచుకుంటుంది .
1. యుద్ధము లో గాయపడినవారికి పునరావాసము కల్పించడం ,
2. సర్వీసులో గల సిబ్బంది ,వారి కుటుంభీకుల సంక్షేమము ,
3. మాజీ సైనికోద్యోగులు , వారి కుటుంబీకుల సంక్షేమము , పునర్నివాసము కల్పించడం ,
సైనిక సిబ్బంది సేవలకు కృతజ్ఞత , ప్రశంసలు తెలియజేయడానికి ఫ్లాగ డే ఒక అవకాశము గా భావిస్తారు . అలాగే దేశరక్షణ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్ఫోయిన సిబ్బంది సేవల గురింపునకు కూడా ఈదో అవకాశము . భారత సైన్యము , వైమానికదళము , నౌకాదళము మూడూ ఫ్లాగ్ డే సందర్భము గా విభిన్న షోలు , కార్నివాల్స్ , నాటకాలు , ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు . జాతీయ భద్రతకోసము తమ సిబ్బంది చేపట్టే కార్యక్రమాలను వీటి ద్వారా సాధారణ ప్రజలకు వివరిస్తారు . దేశము అంతా ఎరుపు , నిండు నీలము , లేత నీలము రంగుల చిన్న పెద్ద్ కార్ ఫ్లాగ్ లను మూడు విభాగాలకు చిహ్నం గా పంచిపెట్టి విరాళాలు స్వీకరిస్తారు .
సంక్షేమ నిధుల్ని 1993 లో రక్షణమంత్రిత్వ శాఖ ' ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ డే ఫండ్ " గా మార్చింది . ఇతరత్రా నిధులు కూడా దీనిలో కలిసి ఉంటాయి . దేశవ్యాప్తంగా నిధుల సేకరణ నిర్వహణ కేంద్రీయ సైనిక బోర్డ్ కూడా సేవలు చేస్తాయి . ఇది రక్షణశాఖలో భాగము . నిధుల సేకరణ అధికారికంగాను , స్వచ్చంద సంస్థల ద్వారా అనధికారికం గాను జరుగుతుంది . కేంద్ర రక్షణమంత్రి అధ్యక్షతనగల మేనేజింగ్ కమిటీ నిధుల పంపిణీ బాధ్యత చేపడుతుంది . ఈ కమిటీలో అన్నిరాస్ట్రాల , కేంద్రపాలిత ప్రాంతాల అధిపతులు సభ్యులుగా ఉంటారు .
- =========================================
No comments:
Post a Comment